ETV Bharat / state

మనం రోజు ఉపయోగించే యాప్​ ద్వారానే సైబర్​ నేరాలు - హోంశాఖ రిపోర్ట్​ - MHA REPORT ON CYBER CRIMES

వాట్సప్​లోనే ఎక్కువగా సైబర్​ నేరాలు జరగుతున్నాయని నివేదికలో పేర్కొన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

MHA Report On Cyber Crimes
MHA Report On Cyber Crimes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 7:51 PM IST

MHA Report On Cyber Crimes : ఈ కంప్యూటర్​ యుగంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త తరహాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. భారీ లాభాల పేరుతో ఆశజూపడం లేదా డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు కాజేస్తున్నారు. ఈ మోసాలకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మెసేజింగ్ ఫ్లాట్​ఫామ్ వాట్సప్​నే వినియోగిస్తున్నారట. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది.

వాట్సప్​ వేదికగా ఎక్కువగా సైబర్​ మోసాలు : మేసేజింగ్ ప్లాట్​ఫామ్ వాట్సప్‌ వేదికగా స్కామర్లు ఎక్కువగా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారని హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత ఈ జాబితాలో టెలిగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్​లు ఉన్నట్లుగా పేర్కొంది. 2023-24 సైబర్‌ మోసాల జాబితాను హోంమంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. 2024 తొలి 3 నెలల్లో వాట్సప్‌ వేదికగా జరిగిన మోసాలకు సంబంధించి 43,797 కంప్లైంట్​లు వచ్చినట్లు ఆ నివేదికలో వెల్లడించింది. ఇక, టెలిగ్రామ్‌లో మోసాలపై 22,680, ఇన్‌స్టా వేదికగా జరిగే క్రైంలపై 19,800 ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.

ఈ నేరాల కోసం గూగుల్‌ సర్వీసెస్‌ ప్లాట్‌ఫామ్‌లను స్కామర్స్ ఉపయోగిస్తున్నట్లు హోంశాఖ పేర్కొంది. కొంతమందిని లక్ష్యంగా చేసుకుని ప్రకటనలు చేసేందుకు గూగుల్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తున్నట్లగా వివరించింది. ఇలాంటి మోసాల కట్టడి కోసం తాము చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొంది. డిజిటల్‌ లెండింగ్‌ యాప్‌ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆయా సోషల్ మీడియాలతో కలిసి పనిచేస్తున్నట్లుగా తెలిపింది.

సైబర్‌ నేరాలపై సాంకేతిక అస్త్రం - 25 వేల సిమ్‌లు, ఐఎంఈఐ నంబర్లు బ్లాక్‌

మహానగరిలో మారిన నేరాల తీరు - డిజిటల్​ అరెస్టు పేరుతో సరికొత్త మోసాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.