ETV Bharat / sports

అశ్విన్ బాటలో టీమ్ ఇండియా సీనియర్లు - వారు రిటైర్మెంట్​ ప్రకటిస్తారా? - BORDER GAVASKAR TROPHY 2024

భారత క్రికెట్​లో రిటైర్మెంట్ సంవత్సరం కానున్న 2025 - ఆటకు వీడ్కోలు పలకనున్న ఆ ప్లేయర్స్​!

Teamindia Retirement
Teamindia Retirement (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 20, 2024, 4:02 PM IST

Teamindia Retirement : టీమ్ ఇండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించి యావత్ క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఈ మేటి బౌలర్ క్రికెట్​కు గుడ్ బై చెప్పాడు. అయితే అశ్విన్ బాటలోనే మరికొందరు సీనియర్లు నడవనున్నట్లు తెలుస్తోంది.

క్రిక్​బజ్​లోని నివేదిక ప్రకారం

2025, భారత క్రికెట్​లో రిటైర్మెంట్ సంవత్సరం కానుంద‌ని విశ్లేషకులు అంటున్నారు. సీనియ‌ర్ ఆట‌గాళ్లు అంతా ఒక్కొక్క‌రిగా లేదంటే ఒకేసారి రిటైర్మెంట్​ కావొచ్చన‌ని చెబుతున్నారు. ఒకవేళ భార‌త జ‌ట్టు వ‌రల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరుకుంటే ఆ మ్యాచ్ త‌ర్వాత జ‌ట్టులో కచ్చితంగా మార్పులు చోటు చేసుకుంటాయ‌టని అంటున్నారు. వచ్చే ఏడాది జూన్​లో లార్డ్స్ వేదిక‌గా డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది.

ఒక‌వేళ భార‌త్ డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్​కు చేరుకోకపోతే బోర్డ‌ర్ - గావస్క‌ర్ ట్రోఫీ త‌ర్వాతే జ‌ట్టులో మార్పులు చోటు చేసుకోవ‌డం ఖాయమ‌ని అంటున్నారు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ర‌వీంద్ర జ‌డేజా వంటి సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు ఇదే చివ‌రి ఆస్ట్రేలియా టూర్ కావొచ్చన‌ని క్రిక్​బజ్​ నివేదిక పేర్కొంది. భారత క్రికెట్​ భ‌విష్య‌త్తును దృష్టిలో ఉంచుకుని జ‌ట్టు మేనేజ్‌మెంట్ నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉందని తెలుస్తోంది.

రిటైర్మెంట్ ఇయర్​గా 2025
"2025లో భారత జట్టులో చాలా మార్పులు ఉంటాయి. బహుశా వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటన నాటికి టీమ్ ఇండియా సీనియర్లు తమ భవితవ్యంపై ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. 2008లో సౌరభ్ గంగూలీ, అనిల్ కుంబ్లే ఒకే సిరీస్ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నట్లుగానే 2025 భారత క్రికెట్​లో రిటైర్మెంట్ సంవత్సరం కావచ్చు." అని క్రిక్ బజ్ ఓ నివేదికలో తెలిపింది.

ఇప్పటికే టీ20కి గుడ్ బై
కాగా, టీమ్ ఇండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ ఏడాది జరిగిన పొట్టి ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ టీ20 ఫార్మాట్​కు గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్లలోనే ఈ ముగ్గురు టీమ్ ఇండియా తరఫున ఆడుతున్నారు.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో విఫలం
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విరాట్ ఒక సెంచరీ చేసినప్పటికీ మిగతా ఇన్నింగ్స్​లో అంతగా రాణించలేకపోయాడు. అలాగే మొదటి టెస్టుకు దూరమైన రోహిత్, మిగిలిన రెండు టెస్టుల్లో నిరాశపరిచాడు. జడేజా కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి అశ్విన్ బాటలోనే వీరందరూ రిటైర్మెంట్ పలకనున్నారని వార్తలు వస్తున్నాయి.

'రెండేళ్లుగా నాకు క్రికెట్ గురించి ఎటువంటి జ్ఞాపకాలు లేవు - అందుకే ఈ రిటైర్మెంట్ అంత బాధగా అనిపించట్లేదు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.