దొంగలను పట్టుకునేందుకు పోలీస్ సాహసం- వీడియో వైరల్ - చెన్నై సెల్‌ఫోన్ దొంగలు
🎬 Watch Now: Feature Video
సెల్‌ఫోన్ దొంగలను చెన్నైకు చెందిన ఆండలిన్ రమేశ్ అనే పోలీస్ అధికారి చాకచక్యంతో పట్టుకున్నారు. ఓ వ్యక్తి దగ్గరనుంచి సెల్‌ఫోన్ లాక్కొని బైక్ పై వెళ్తున్న దుండగులను ఛేదించి పట్టుకున్నారు రమేశ్. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దొంగలను సినీఫక్కీలో పట్టుకున్న పోలీస్ అధికారిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఘటనపై చెన్నై పోలీస్ కమిషనర్ మహేశ్ కుమార్ అగర్వాల్ స్పందించారు. పోలీస్ అధికారి ఆండలిన్ రమేశ్‌ను అభినందించారు.
Last Updated : Nov 28, 2020, 7:43 PM IST