దారుణం: నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య - తుమకూరు లైవ్ మర్డర్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5000050-thumbnail-3x2-murder.jpg)
కర్ణాటక తుమకూరులో నడిరోడ్డుపై మహంతేశ్ అనే వ్యక్తిని కత్తితో పొడిచాడు ఓ దుండగుడు. తీవ్రంగా గాయపడిన మహంతేశ్ ప్రతిఘటించి పారిపోగా.. అతడు వెంటపడ్డాడు. స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకోవడం వల్ల చివరికి దుండగుడు భయంతో పారిపోయాడు. గాయం కారణంగా తీవ్ర రక్తస్రావమైన మహంతేశ్.. రోడ్డుపైనే కుప్పకూలాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మహంతేశ్ చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.