యువకుడి చేతులు కట్టేసి.. చితకబాదుతూ వీడియో తీసి... - రాజస్థాన్ ఛిత్తోర్గఢ్ వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12152763-thumbnail-3x2-ss.jpg)
ఓ యువకుడి చేతులు కట్టేసి గొడ్డును బాదినట్టు బాదాడు ఓ దుండగుడు. బాధితుడు వదిలేయమని బతిమాలుతున్నా కనికరించలేదు. దీనిని మరో వ్యక్తి వీడియో తీశాడు. రాజస్థాన్లోని ఛిత్తోర్గఢ్ జిల్లా భసోడా ప్రాంతంలో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగినట్టు సమాచారం. బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.