అబ్బురపరిచే సూక్ష్మ కళ.. సీసాలో హరుని కోవెల - సూక్ష్మ శివాలయం
🎬 Watch Now: Feature Video
మహా శివునిపై భక్తిని తన కళ ద్వారా వ్యక్తపరిచాడు ఒడిశాలోని భువనేశ్వర్‌కు చెందిన సూక్ష్మ కళాకారుడు ఎల్.ఈశ్వర రావు. రెండు లీటర్ల గాజు సీసాలో 12 అంగుళాల సూక్ష్మ శివాలయాన్ని నిర్మించాడు. బంకమట్టి, పేపర్, గాజు ముక్కలతో ఈ కళాకృతిని రూపొందించినట్లు చెప్పారు ఈశ్వర్. అందుకోసం 3 నెలలపాటు శ్రమించినట్లు వివరించాడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ దేవాలయాన్ని భక్తుల ముందుంచారు.