Viral Video: బైక్ను భుజాలపై మోసి.. నది దాటించి - బైకుపై సాహసం
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్ అగర్ మాల్వా జిల్లాను భీకర వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల ప్రభావంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో చోమా గ్రామానికి చెందిన కొంతమంది.. ఓ కాలువను దాటేందుకు నానా అవస్థలు పడ్డారు. తమ ద్విచక్రవాహనాన్ని భుజాలపైకి ఎత్తుకొని, సాహసం చేస్తూ.. బైకును నది దాటించారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ మార్గంలో వంతెన లేకపోవడం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు.
Last Updated : Jul 28, 2021, 9:55 AM IST