భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు - Badrinath national highway news
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్లో ప్రకృతి విలయం కొనసాగుతోంది. భారీ వర్షాల వల్ల చమోలీ జిల్లా కొడియాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారిపై మట్టి పేరుకుపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలాలను తొలగించేందుకు విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.