3 నిమిషాల్లో 204 స్ట్రైక్‌లు.. గిన్నిస్ బుక్ రికార్డ్..
Knee Striker Sachin Behera: ఒడిశాకు చెందిన స్ట్రైకర్ సచిన్ బెహెరా మరోసారి గిన్నిస్
బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. నౌపడా జిల్లాకు చెందిన సచిన్.. కాళ్లకు ఐదు కిలోల బరువు కట్టుకుని మోకాళ్లతో అత్యధిక స్ట్రైక్‌లు చేశాడు. మూడు నిమిషాల్లో 204 ఫుల్ స్ట్రైక్‌లు చేసి రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు పాకిస్థాన్‌కు చెందిన మహమ్మద్ రషీద్ మూడు నిమిషాల్లో 178 స్ట్రైక్‌లు చేసిన రికార్డును అధిగమించాడు. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు సచిన్. 2019లోనూ సచిన్ ఒక్క నిమిషంలో 137 సార్లు స్ట్రైక్‌లు చేసి మొదటిసారి గిన్నిస్ బుక్‌లో చోటు సాధించాడు.