Viswam Movie OTT : వీకెండ్ వచ్చేసింది. ప్రతివారం లాగే ఈ వీకెండ్లో కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇటీవల రిలీజైన కొన్ని సినిమాలకు సంబంధించి స్ట్రీమింగ్ తేదీని ముందే ప్రకటించగా, మరికొన్ని చిత్రాలు ఎలాంటి ప్రకటనా లేకుండానే లైసెంట్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేశాయి. మరి ఆ సినిమాలేంటంటే?
విశ్వం : మ్యాచో స్టార్ గోపిచంద్- శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కిన సినిమా 'విశ్వం'. ఈ సినిమా రీసెంట్గా రిలీజై మంచి విజయం దక్కించుకుంది. సినిమాలో హీరోయిన్గా కావ్య థాపర్ నటించింది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన విశ్వం ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. తాజాగా ఎలాంటి ప్రకటనా లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌కు అవుతోంది.
హిట్లర్ : విజయ్ ఆంటోనీ- రియా సుమన్, గౌతమ్ మేనన్ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'హిట్లర్'. సెప్టెంబరులో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ధన దర్శకత్వంలో ఈ సినిమా రూపొంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సైలెంట్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.
బ్రాక్ : జీవా- ప్రియా భవానీ శంకర్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన రీసెంట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'బ్లాక్'. దర్శకుడు కేజీ బాల సుబ్రహ్మణియన్ ఈ సినిమా తెరకెక్కించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, ఇప్పటికైతే తమిళంలోనే అందుబాటులో ఉంది.
ఎఆర్ఎమ్ : 'మిన్నల్ మురళ','2018' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ కథానాయకుడు టొవినో థామస్. ఆయన నటించిన 50వ చిత్రమే 'ఎ.ఆర్.ఎమ్'. ఇందులో ఆయన త్రిపుల్ రోల్లో నటించారు. సెప్టెంబరు 12న విడుదలైన ఈ మూవీ నవంబర్ 8న ఓటీటీలోకి రానుంది. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ పోస్టర్ షేర్ చేసింది. కాగా, మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ మూవీని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.
ఇబ్బని తబ్బిజ ఇలేయాలే : విహన్ గౌడ - అంకిత అమర్ జంటగా చంద్రజిత్ బెల్లియప్ప దర్శకత్వంలో రూపొందిన మూవీ 'ఇబ్బని తబ్బిడ ఇలేయాలే'. సెప్టెంబరు 5న విడుదలైన ఈ సినిమా రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని హిట్ కొట్టింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది.
దీపావళి స్పెషల్ - కొత్త సినిమా/సిరీస్‌లతో ముస్తాబైన ఓటీటీలు - ఆ మూవీ వెరీ స్పెషల్
OTTలోకి ఒక్కరోజే 6 సినిమాలు - ఆ 11 మంది అమ్మాయిలను చంపిన సీరియల్ కిల్లర్ మూవీ కూడా!