ETV Bharat / state

నేటి నుంచి నయా రూల్స్​ : క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల్లో కోతలు, నగదు బదిలీలో మార్పులు

రైల్వే జర్నీ టికెట్ బుకింగ్, క్రెడిట్‌ కార్డుల వినియోగంపై కొత్త రూల్స్ - నేటి నుంచి కొత్త నిబంధనలు అమలు

New Rules From November 2024
New Rules From November 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

New Rules From November 2024 : నవంబర్‌ మాసం వచ్చేసింది. రోజూ వినియోగించే క్రెడిట్‌ కార్డులతో పాటు రైలు టికెట్‌ బుకింగ్‌ విషయంలో ఐఆర్‌సీటీసీ నయా మార్పులూ నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఇండియన్‌ బ్యాంక్‌ తీసుకొచ్చిన ఎఫ్‌డీ సైతం ఈ నెలలోనే కంప్లీట్​ కానుంది. ఇలా నవంబర్‌లో వస్తున్న ఆర్థిక మార్పుల వివరాలు ఈ స్టోరీలో మీ కోసం..

ఐసీఐసీఐ బ్యాంక్‌ భారీ షాక్‌

క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు ఐసీఐసీఐ బ్యాంక్‌ షాకిచ్చింది. వివిధ క్రెడిట్‌ కార్డులపై ఇస్తున్నటువంటి రివార్డు పాయింట్లను తగ్గించింది. గ్రాసరీ, డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌లో చేసే ఖర్చులు, లాంజ్‌ యాక్సెస్‌ రివార్డుపై దీని ఎఫెక్ట్​ పడనుంది. ఫ్యూయల్‌ (ఇంధనం) కొనుగోలుపై విధించే సర్‌ఛార్జి రద్దు ఇకపై నెలకు రూ.50 వేల వరకు మాత్రమే వర్తిస్తుంది. థర్డ్‌ పార్టీ యాప్స్‌ సాయంతో చేసే ఎడ్యుకేషన్‌ ఫీజు చెల్లింపులపై 1 శాతం అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్స్ నవంబర్‌ 15 నుంచి అమల్లోకి వస్తాయి.

వాణిజ్య సిలిండర్‌ ధరకు మళ్లీ రెక్కలు

రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధరపై మళ్లీ మోతమోగింది. నేటి (నవంబరు 1) నుంచి ఈ సిలిండర్లపై రూ.62 పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1,802కు ఎగబాకింది. 5 కేజీల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్‌ ధరను కూడా రూ.15 వరకు పెంచారు. అయితే, ఇంటి అవసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి.

ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ నయా రూల్స్‌

భారతదేశ అతిపెద్ద బ్యాంకింగ్​ నెట్​వర్క్ స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్రెడిట్‌ కార్డ్‌ ఫైనాన్స్‌ ఛార్జీలను సవరించింది. నెలకు 3.50 శాతంగా ఉన్న మొత్తాన్ని నేటి నుంచి 3.75 శాతానికి పెంచింది. కాగా శౌర్య, డిఫెన్స్‌ కార్డులను మాత్రం ఈ పెంపు నుంచి మినహాయించింది. అలాగే, ఒక బిల్లింగ్‌ సైకిల్‌లో చేసే యుటిలిటీ పేమెంట్లు (కరెంట్, గ్యాస్‌) రూ. 50,000 దాటితే 1 శాతం సర్‌ఛార్జి వసూలు చేయనుంది. ఇవాళ్టి నుంచే ఈ నిబంధన అమల్లోకి రానుంది. మరోవైపు డిసెంబర్‌ 1 నుంచి యుటిలిటీ బిల్లు మొత్తం రూ.50 వేలు దాటితే బిల్లు మొత్తానికి సర్‌ఛార్జి బ్యాంక్‌ వసూలు చేయనుంది.

ఐఆర్‌సీటీసీలో సరికొత్త మార్పులు

ట్రైన్ టికెట్‌ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ రైల్వే కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. జర్నీకి సంబంధించి 120 రోజుల ముందుగానే బుకింగ్‌ చేసుకునే సదుపాయం ఉండగా.. దానిని 60 రోజులకు కుదించింది. ఇవాళ్టి ( నవంబర్‌ 1) నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.

ఐఎన్‌డీ సూపర్‌ 400

ఇండియన్‌ బ్యాంక్‌ ఐఎన్‌డీ సూపర్‌ 400, ఐఎన్‌డీ సూపర్‌ 300 పేరుతో రెండు కాల వ్యవధులతో స్పెషల్ ఎఫ్‌డీ (ఫిక్సిడ్​ డిపాజిట్) స్కీమ్‌లను గతంలో తీసుకొచ్చింది. 300 రోజులకు ఎఫ్‌డీ చేస్తే జనరల్ కస్టమర్లకు 7.05 శాతం వడ్డీ ఇస్తోంది. అదే సీనియర్‌ సిటిజన్లకు ఐతే 7.55 శాతం వరకూ వడ్డీని అందిస్తోంది. 400 రోజుల వ్యవధి డిపాజిట్లపై 7.30 శాతం వడ్డీని ఇస్తోంది. సీనియర్‌ సిటిజన్లకు గరిష్ఠంగా 7.55 వడ్డీని ఆఫర్‌ చేస్తోంది. నవంబర్‌ 30తో ఈ ఎఫ్‌డీల టైం పీరియడ్​ ముగియనుంది.

ఆర్‌బీఐ మనీ ట్రాన్స్​ఫర్ రూల్‌

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేటి నుంచి దేశీయ నగదు బదిలీకి సంబంధించిన కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఆర్థిక చట్టాలకు ఫైనాన్షియల్‌ సంస్థలు లోబడి, దేశీయ మనీ ట్రాన్స్​ఫర్స్​ భద్రతను పెంచేలా ఈ నిబంధనలను రూపొందించింది. బ్యాంకింగ్ అవుట్‌లెట్‌ల లభ్యత, నగదు చెల్లింపుల వ్యవస్థ మెరుగుపరచడం, కేవైసీ రూల్స్ సులభతరం చేయడం ఈ నిబంధనల ముఖ్య ఉద్దేశం.

రైల్వే అడ్వాన్స్​ రిజర్వేషన్ టైమ్​ ఇకపై 60 రోజులే- టికెట్​ బుకింగ్​ రూల్స్​ ఛేంజ్​

అదనపు క్రెడిట్​ కార్డ్​లను క్లోజ్ చేస్తే - లాభమా? నష్టమా? - Credit Card Closure Pros And Cons

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.