పెళ్లి కోసం పాదయాత్ర - 110 కిమీ నడిచిన 62 మంది యువకులు
🎬 Watch Now: Feature Video
Published : Oct 30, 2024, 4:41 PM IST
Youth Padayatra for Bride in Karnataka : పెళ్లి కోసం కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మలే మహదేశ్వర కొండకు అనేక మంది యువకులు పాదయాత్ర చేపట్టారు. తర్వగా పెళ్లి జరిగేలా చూడమని మహదేశ్వరునికి ప్రత్యేక పూజాలు చేశారు.
కొళ్లేగాల గ్రామంలోని హోసమాలంగి ప్రాంతానికి చెందిన పెళ్లి కాని సుమారు 62 మంది యువకులు 110 కిలోమీటర్లు నడిచి వచ్చి మహదేశ్వరుని దర్శనం చేసుకున్నారు. కొండపైకి వెళ్లి సామూహికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'మా గ్రామంలో 62 మంది యువకులకు పెళ్లి కాలేదు. ఎంత వెతికినా అమ్మాయిలు దొరడం లేదు. మాపై దయ చూపించిమని మహేదేశ్వరునికి కోరుతూ ప్రాదయాత్రను ప్రారంభించాం' అని హోసమాలంగి యువకులు తెలిపారు.
ఏటా యువకులు తమకు త్వరగా పెళ్లి కావాలని మహదేశ్వర్ కొండకు నడుకుంటూ వెళ్లి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలా చేస్తే త్వరలోనే పెళ్లి సంబంధం కుదురుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.