Young Players 2025 IPL Retentions : 2025 ఐపీఎల్ రిటెన్షన్స్‌లో యువ క్రికెటర్లు సత్తా చాటారు. దాదాపు అన్ని ఫ్రాంచైజీలు సీనియర్ల కంటే ఎక్కువగా కుర్రాళ్లకే ప్రాధాన్యం ఇచ్చాయి. గతంలో కొనుగోలు చేసిన ధర కంటే ఎక్కువగా హైక్ ఇచ్చి మరీ యంగ్ ప్లేయర్లను భారీ ధరకు అట్టిపెట్టుకున్నాయి. దీంతో గతంలో బెస్ప్రైజ్కు అమ్ముడైన ఆటగాళ్లు సైతం ఈసారి రిటెన్షన్స్‌లో కోట్లు దక్కించుకున్నారు. మరి ఈ జాబితాలో ఉన్న ప్లేయర్లు ఎవరో చూద్దాం
- ధ్రువ్ జురెల్ : 2023 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్‌ను బెస్ప్రైజ్ రూ.20 లక్షలకు దక్కించుకుంది. అయితే కీపింగ్ స్కిల్స్ ఉండడం వల్ల రాజస్థాన్ ఈసారి అతడిని అట్టిపెట్టుకుంది. రిటెన్షన్స్‌లో జురెల్ ఏకంగా రూ. 14కోట్లు దక్కించుకున్నాడు.
- మయాంక్ యాదవ్ : పేస్ గన్ మయాంక్ యాదవ్‌ను గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకుంది. 2023లో అతడి శాలరీ రూ. 20లక్షలు కాగా, ఇప్పుడు రూ.11 కోట్లు అందుకోనున్నాడు.
- రజాత్ పటిదార్ : 2021 ఐపీఎల్లో ఆర్సీబీ పటిదార్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా, తాజా రిటెన్షన్స్‌లో రూ.11 కోట్లకు అట్టిపెట్టికుంది.
- రింకూ సింగ్ : సిక్సర్ కింగ్ రింకూ సింగ్‌ను 2022 మెగా వేలం సందర్భంగా కేకేఆర్ రూ. 55 లక్షలకు దక్కించుకుంది. అయితే ఈసారి రింకూ శాలరీ భారీగా పెరిగిపోయింది. 2025 సీజన్‌కు గాను రింకూ రూ.13కోట్ల శాలరీ తీసుకోనున్నాడు.
- ట్రిస్టన్ స్టబ్స్ : ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకునే స్టబ్స్ కూడా ఈసారి మంచి ధర దక్కించుకున్నాడు. అతడిని గతేడాది దిల్లీ క్యాపిటల్స్ రూ.55 లక్షలకు కొనుగోలు చేయగా, ఈసారి రూ.10 కోట్లు ఇవ్వనుంది.
- సాయి సుదర్శన్ : 2022 వేలంలో యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ. 20 లక్షల బేస్‌ప్రైజ్ కు దక్కించుకుంది. మూడు సీజన్లుగా నిలకడగా రాణిస్తున్న సుదర్శన్‌ను గుజరాత్ అట్టిపెట్టుకుంది. అతడు రిటెన్షన్స్‌లో రూ.8.5 కోట్లు దక్కించుకున్నాడు.
- నితిశ్ కుమార్ రెడ్డి : తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ 2023లో రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. గతేడాది అద్భుతంగా రాణించిన నితీశ్‌ను సన్‌రైజర్స్ వదులుకోడానికి ఇష్టపడలేదు. దీంతో ఈసారి నితీశ్‌కు రూ. 6కోట్లు ఇచ్చి మరీ అట్టిపెట్టుకుంది
- శశాంక్ సింగ్ : 2024 మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్‌ను రూ.20 లక్షలకు తీసుకుంది. అయితే వేలంలో పంజాబ్ కాస్త తికమకకు గురై ఇంకొకరికి బదులుగా ఈ శశాంక్ సింగ్‌ను కొనుగోలు చేసిందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈసారి అదే శశాంక్ సింగ్‌ను పంజాబ్ రిటైన్ చేసుకుంది. ఈసారి శశాంక్ రూ.5.5 కోట్లు శాలరీ అందుకోనున్నాడు.
ఈ లిస్ట్‌లో దాదాపు అందరు ప్లేయర్లు గతంలో బేస్‌ప్రైజ్‌కు అమ్ముడైన వాళ్లే. గడిచిన రెండు, మూడు సీజన్లలో తమతమ ప్రదర్శనతో సత్తా చాటడం వల్ల ఆయా ఫ్రాంచైజీలు వారిపై నమ్మకం ఉంచాయి. దీంతో వీళ్లంతా ఒక్కసారిగా కోటీశ్వరులు అయిపోయారు.
I'm going nowhere. I belong here, mana Hyderabad. The chapter has just begun. Uppal, malli vastunna. 🧡
— Nitish Kumar Reddy (@NKReddy07) October 31, 2024
Grateful to be a part of this franchise yet again. Looking forward to go the extra mile this season along with you guys! 💪🏼 pic.twitter.com/bj5rCU1tRq
బుమ్రా, సూర్యకుమార్ కంటే తక్కువ వాల్యూ - రోహిత్ ఏమన్నాడంటే?
రింకూకు దీపావళి బోనస్- శాలరీ రూ.55 లక్షల నుంచి రూ.13కోట్లు- భారీ హైక్ గురూ!