ETV Bharat / international

ఇజ్రాయెల్‌పై మరో దాడికి ఇరాన్ ​ప్లాన్- ఈసారి వారితో అటాక్- అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే! - ISRAEL IRAN WAR

ఇజ్రాయెల్​పై మరోసారి దాడి చేసేందుకు ఇరాన్ మరో ప్లాన్ రచించింది! - అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే నవంబర్​ 5వ తేదీకి ముందే ఈ దాడి చేసే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది.

Israel Iran War
Israel Iran War (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2024, 7:04 PM IST

Israel Iran War : ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య పరస్పర దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. తాజాగా మరోసారి ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్‌ యత్నిస్తోందని నిఘా వర్గాల సమాచారం. అమెరికా ఎన్నికలు జరిగే నవంబర్‌ 5వ తేదీకి ముందే ఈ దాడి జరిగే అవకాశం ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. మరోవైపు ఇరాక్‌లోని ఇరాన్‌ అనుకూల మిలిటెంట్ల ద్వారా ఇజ్రాయెల్‌పై దాడి చేయించేందుకు టెహ్రాన్‌ యత్నిస్తోందని తెలుస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడి చేయాలని ఇరాన్ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీ ఖమేని తన దళాలను ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ ముదురుతున్నాయి. ఇజ్రాయెల్‌పై మరోసారి దాడికి ఇరాన్‌ సిద్ధం అవుతున్నట్లు ఇజ్రాయెల్‌ నిఘా వర్గాల సమాచారం. ఇరాక్‌ గడ్డ నుంచి ఇరాన్‌ ఈ దాడులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా అంతకుముందే ఈ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో డ్రోన్లు, బాలిస్టిక్‌ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడేందుకు ఇరాన్‌ చూస్తున్నట్లు యాక్సియోస్‌ రిపోర్టు వెల్లడించింది. ఇరాక్‌లోని ఇరాన్‌ అనుకూల మిలిటెంట్ల ద్వారా ఈ దాడిని చేపట్టేందుకు టెహ్రాన్‌ సిద్ధమవుతున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అందువల్ల ఇజ్రాయెల్‌ మరోసారి ప్రతీకార చర్యలు చేపట్టకుండా ఉండే అవకాశం ఉంటుందని ఇరాన్‌ భావిస్తోంది.

హమాస్‌ అధినేత ఇస్మాయెల్‌ హనీయా, హెజ్‌బొల్లా చీఫ్‌ సయ్యద్‌ హసన్‌ నస్రల్లా, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన నిల్పోరూషన్‌ మరణానికి ప్రతీకారంగా నెల క్రితం ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ భీకరంగా విరుచుకుపడింది. 200 మిస్సైళ్లతో ఇరాన్‌ దాడి చేయడం వల్ల ఇజ్రాయెల్‌ ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు. అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ కూడా ఇటీవల ఇరాన్‌పై దాదాపు 200 యుద్ధవిమానాలతో దాడికి దిగింది. డ్రోన్‌ ఫ్యాక్టరీలు, బాలిస్టిక్‌ క్షిపణి తయారీ, ప్రయోగ కేంద్రాలపై దాడి చేసింది. ఇజ్రాయెల్‌ దాడుల్లో నలుగురు ఇరాన్‌ సైనికులు మృతి చెందగా, క్షిపణి తయారీ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడికి ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది. దాడి ఘటన తమ దేశంపైకి రాకుండా ఉండేందుకు ఇరాక్‌ గడ్డ నుంచి దాడి చేయాలని ఇరాన్‌ భావిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు ఇజ్రాయెల్‌పై ప్రతిదాడి చేయాలని ఇరాన్ సుప్రీంలీడర్‌ అయతొల్లా అలీఖమేని తన దళాలను ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఓ వార్తాసంస్థ కథనాన్ని ప్రచురించింది. ఇటీవల ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో జరిగిన నష్టం, ప్రతిదాడికి సంబంధించి ఇరాన్ అధికారులు చర్చించుకున్నారు. జాతీయ భద్రతా మండలి రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా ప్రతిదాడికి సిద్ధమవ్వాలని ఖమేనీ తన సైనిక అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక స్థావరాల జాబితాను ఇరాన్‌ అధికారులు రూపొందిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌పై మళ్లీ ఇరాన్‌ దాడి చేస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగాయి. ఇరాన్‌ మరోసారి దాడి చేస్తే గతంలో తాము వదిలేసిన టార్గెట్లను ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్‌ కూడా ఇప్పటికే హెచ్చరించింది.

ఇజ్రాయెల్​పై ప్రొజెక్టైల్స్​ దాడి- నలుగురు విదేశీ కార్మికులు సహా ఏడుగురు మృతి

ఇజ్రాయెల్​తో యుద్ధం కొనసాగుతుంది: హెజ్‌బొల్లా కొత్త చీఫ్‌ నయీం ఖాసిం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.