Oben Rorr EZ Electric Motorcycle: దేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థల్లో ఒకటైన ఒబెన్ ఎలక్ట్రిక్ ఎట్టకేలకూ తన కొత్త 'ఒబెన్ రోర్ EZ' టీజర్‌ను రిలీజ్ చేసింది. టీజర్లో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రిలీజ్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించింది. ఈ బైక్‌ను డైలీ కంమ్యూటర్ సెగ్మెంట్లో ఈ ఏడాది నవంబర్ 7వ తేదీన రిలీజ్ చేయనుంది. ఈ విభాగంలో ఇది ఒక విప్లవం తీసుకురాగలదని కంపెనీ పేర్కొంది.
ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రస్తుత పరిస్థితులను ఛాలేంజ్ చేస్తుందని, ఎలక్ట్రిక్ మొబిలిటీలో కొత్త ఆవిష్కరణ, ఎక్సైట్మెంట్ను తీసుకురాబోతుందని తెలిపింది. కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి రివీల్ చేయలేదు. అయితే బైకర్స్ ఎదుర్కొనే సాధారణ సమస్యలను పరిష్కరించేలా ఈ బైక్ డిజైన్, పెర్ఫార్మెన్స్, కంఫర్ట్, ఫీచర్లు ఉంటాయని అంతా భావిస్తున్నారు. కంపెనీ ఈ ఒబెన్ రోర్ EZ ఎలక్ట్రిక్ బైక్‌తో రోజువారీ ప్రయాణ అనుభవాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ బైక్ అత్యాధునికమైన పేటెంట్ పొందిన హై-పెర్ఫార్మెన్స్ గల LFP బ్యాటరీ సాంకేతికతతో వస్తుంది. ఇది ఎక్సెప్షినల్ హీట్ రెసిస్టెన్స్, లాంగ్ లైఫ్‌తో మన దేశంలోని వాతావరణ మార్పులకు తగినట్లుగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ఓబెన్ ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ టూ-వీలర్స్‌లో ఈ LFP కెమిస్ట్రీ బ్యాటరీలను ఉపయోగించడం ప్రారంభించింది. ఇది అత్యున్నత సేఫ్టీ స్టాండర్డ్స్‌తో అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో రీసెర్చ్, డెవలప్మెంట్ విషయంలో కంపెనీ ఎంతో నిబద్ధతతో పనిచేసిందని, ఇదే ఒబెన్ ఎలక్ట్రిక్ విజయానికి కారణమని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, మోటార్లు, వెహికల్ కంట్రోల్ యూనిట్లు, ఫాస్ట్ ఛార్జర్లు వంటి క్లిష్టమైన భాగాల తయారీ కోసం కెంపెనీ ఈ R&D ప్రాసెస్‌ను ఉపయోగించినట్లు తెలిపింది.
ఇది సమస్యలను పరిష్కరించి కొత్త వస్తువులు, సర్వీసులను రూపొందించేందుకు బేసిక్, అప్లైడ్ రీసెర్చ్‌లను చేసే సిస్టమేటిక్ యాక్టివిటీ. ఇదే ప్రాసెస్‌లో రూపొందించి ప్రస్తుతం కంపెనీ తీసుకొస్తున్న ఈ కొత్త బైక్ యూజర్స్‌కు గొప్ప రైడింగ్ అనుభూతిని మాత్రమే కాక షేమ్‌లెస్ ఓనర్షిప్ జర్నీని కూడా ఇస్తుందని ఒబెన్ ఎలక్ట్రిక్ చెబుతోంది.