హిందూ సంప్రదాయంలో ఇటాలియన్​ జంట పెళ్లి- వీడియో చూశారా? - ITALIAN COUPLE WEDDING IN INDIA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2024, 11:46 AM IST

Italian Couple Marriage In Hindu Culture : భారతీయ సంప్రదాయాలకు ముగ్ధులైన ఓ విదేశీ జంట ఇండియాకు వచ్చి మరీ వివాహం చేసుకున్నారు. వేద మంత్రాల మధ్య ఇటాలియన్ జంట ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుక మధ్యప్రదేశ్​లోని ఛతర్​పుర్​ జిల్లాలో జరిగింది.  

ఇటలీకి చెందిన విన్సెంజో పటెర్ను యోస్టో, నదియా ఫావా ఇద్దరు హిందూ సంప్రదాయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం ఇటలీ నుంచి మధ్యప్రదేశ్​కు వచ్చారు. అక్కడ గైడ్​ ప్రియాంక అన్హు గౌతమ్​ సాయంతో ఛతర్​పుర్​ జిల్లాలోని ఖజురహో పండిట్ అశోక్​ మహారాజ్​ ఆలయంలో వివాహం చేసుకున్నారు. భారతీయ సంప్రదాయంలోనే వస్త్రాలు ధరించి వేద మంత్రాల మధ్య ఏడడుగులతో వివాహబంధంలోకి అడుగు పెట్టారు.  

ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని గైడ్​ గౌతమ్​ చెప్పారు. తను విన్సెంజో జంటను చాలా సార్లు ఇటలీ కలిసినట్లు తెలిపాడు. అప్పుడే భారతీయ సంప్రదాయంపై ఉన్న తమ ఇష్టాన్ని వ్యక్తం చేశారని, అదే విధంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. వారు కోరుకున్న విధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నాడు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.