ETV Bharat / entertainment

'లక్కీ భాస్కర్', 'క' సినిమాల డే 1 కలెక్షన్స్ ఎంతంటే? - LUCKY BHASKAR BOX OFFICE COLLECTION

'లక్కీ భాస్కర్', 'క' చిత్రాల తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?

Lucky Bhaskar And Ka Movie Day 1 Box Office Collections
Lucky Bhaskar And Ka Movie Day 1 Box Office Collections (ETV BHARAT)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2024, 1:13 PM IST

Lucky Bhaskar Box Office Collection : కోలీవుడ్ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ లీడ్​ రోల్​లో వెంకీ అట్లూరి తెరకెక్కించిన 'లక్కీ భాస్కర్‌' మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్​తో థియేటర్లలో రన్ అవుతోంది. ఈనేపథ్యంలోనే తాజాగా మేకర్స్ ఫస్ట్​డే కలెక్షన్స్‌ వివరాలను రివీల్ చేశారు. చిత్ర నిర్మాణసంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. దాని ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.12.7 కోట్లకు పైగా గ్రాస్‌ వసూలుచేసిందని తెలుస్తోంది.

1980-90స్​లో బ్యాంకింగ్‌ సెక్టార్‌ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. భాస్కర్‌ అనే మిడిల్ క్లాస్​ ఫ్యామిలీకి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి. అయితే కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం కోసం ఎలాంటి రిస్క్‌ చేశాడనే కాన్సెప్ట్​తో ఈ కథను రూపొందించారు. రెట్రో లుక్​లో దుల్కర్ అదరగొట్టగా, భాస్కర్‌ సతీమణి సుమతిగా స్టార్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ఆడియెన్స్​ను ఆకట్టుకున్నాయని సమాచారం.

'క' మూవీ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
మరోవైపు 'లక్కీ భాస్కర్​'తో పాటు దీపావళి కానుకగా విడుదలైన కిరణ్‌ అబ్బవరం 'క' కూడా మంచి టాక్ అందుకుంది. ఇక ఈ మూవీ టీమ్​ కూడా తమ చిత్ర తొలిరోజు వసూళ్లను తాజాగా ప్రకటించింది. రూ.6.18 కోట్లకు పైగా గ్రాస్‌ సొంతం చేసుకుందంటూ చెప్పింది. అయితే తొలుత ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా మూవీగా ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల ఇప్పుడు తెలుగులో మాత్రమే విడుదల అయ్యింది.

ఇక 'క' సినిమాలో కిరణ్ అబ్బవరంతో పాటు నయన్ సారిక, తన్వీ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రం భారీగా రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ సినిమాను సుజీత్, సందీప్ డైరెక్ట్ చేశారు. టీజర్, సాంగ్స్ కూడా మూవీ లవర్స్​ను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తెలుగులో దుల్కర్ మరో మూవీ- రైతు పాత్రలో అలా! - Dulquer Salmaan

'చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా' - 'క' సక్సెస్​పై కిరణ్ అబ్బవరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.