హైవేపై ఏనుగు హల్​చల్​- వాహనాన్ని అడ్డగించి..

By

Published : Oct 10, 2021, 9:51 AM IST

thumbnail

కర్ణాటకలో ఓ ఏనుగు జాతీయరహదారిపై హల్‌చల్‌ చేసింది. కర్ణాటక- తమిళనాడు సరిహద్దు అటవీప్రాంతంలోని బన్నారి చెక్‌పోస్ట్‌ వద్ద అరటి పండ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ భారీ గజరాజు అడ్డగించింది. పండ్ల కోసం వాహనం పైకి ఎక్కేందుకు యత్నించింది. ఈ నేపథ్యంలో.. ఏనుగును తరిమేందుకు ఇతర వాహనదారులు భారీ శబ్దాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన గజరాజు అక్కడ వారి వెంటపడడం వల్ల భయంతో పరుగులు తీశారు. కొంతసేపటి తరువాత అక్కడికి వచ్చిన అటవీ అధికారులు.. ఏనుగును అడవిలోకి తరిమి వేయగా అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.