భూమిని ఆకాశం ముద్దాడిన దృశ్యం చూశారా? - ప్రకృతి అందాలతో మురిసిన పర్యాటకులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4539059-thumbnail-3x2-beautiful.jpg)
కర్ణాటక చిక్కమగలూరులో అద్భుతం ఆవిష్కృతమైంది. ముల్లాయన్గిరి పశ్చిమ కనుమల్లోని బాబా బుదాన్గిరిని మేఘాలు ముద్దాడాయి. ఈ దృశ్యాలు చూపరులకు కనువిందు చేశాయి. కొండపై నుంచి చూస్తే దట్టంగా అలముకున్న కారుమబ్బులు పాదాలను తాకుతున్నట్లు భ్రమింపజేశాయి. చేతికి అందేంత ఎత్తులో మరో ఆకాశం ఉందా అనేంతగా పర్యటకులను అబ్బురపరిచాయి. ఆకాశం మేఘావృతమై ఉన్న సమయంలో ఆ సుందర దృశ్యాలను చూసేందుకు ముల్లాయన్గిరికి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
Last Updated : Oct 1, 2019, 8:18 PM IST