పట్టపగలే కత్తితో బెదిరించి బంగారం చోరీ - జువెలరీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13998349-thumbnail-3x2-gold-chain.jpg)
Jewellery Theft: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. హెల్మెట్ ధరించి ఓ జువెలరీ షాపులోకి చొరబడ్డ దుండగుడు చోరీ చేశాడు. యజమానిని కత్తితో బెదిరించి 25 గ్రాముల గోల్డ్ చైన్ దోచుకెళ్లాడు. కేరళ కొల్లంలోని మూన్నంకుట్టి జంక్షన్లో డిసెంబర్ 23న మధ్యాహ్నం జరిగిందీ ఘటన. సీసీటీవీలో సంబంధిత దృశ్యాలు నమోదయ్యాయి. యజమాని అతడిని ఛేదించే క్రమంలో.. దుండగుడి చేతిలో కత్తి పడిపోయింది. దొంగ కింద పడినా.. వెంటనే లేచి పరిగెత్తి తప్పించుకున్నాడు. మరో ఇద్దరితో కలిసి బైక్పై పారిపోయాడని తెలిపిన పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు.