Viral Video: పాఠశాలలోకి వెళ్లేందుకు ప్రధానోపాధ్యాయుడి పాట్లు! - వరద

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 31, 2021, 9:01 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ సిద్ధార్థ​నగర్​లో విచిత్ర ఘటన జరిగింది. హరివంశ్​పుర్​ ప్రాథమిక పాఠశాల ఎదుట మురికి నీరు చేరుకోగా.. దానిని దాటేందుకు ఆ స్కూలు ప్రధానోపాధ్యాయుడు నానా తంటాలు పడ్డారు. ఇక చేసేది ఏమీ లేక.. తన కాళ్లను కాపాడుకునేందుకు వంట కోసం ఉపయోగించే గిన్నెలను వాడుకున్నారు. వాటిలో కాళ్లను పెట్టి.. మురికి నీటిని దాటేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన పక్కనే ఉన్న ఓ వ్యక్తి ప్రిన్సిపల్​ నడిచేందుకు సాయం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పాఠశాల దుస్థితి, ప్రిన్సిపల్​ వింత ప్రవర్తనపై నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.