Viral: నడుస్తున్న బైకులో మంటలు - Moving bike catches fire
🎬 Watch Now: Feature Video
ప్రయాణంలో ఉన్న సమయంలో మంటలు చెలరేగి ఓ బైకు పూర్తిగా దగ్ధమైన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. సివనీ జిల్లాలోని ఛపారాలో పెట్రోల్ బంక్‌కు సమీపంలోనే బైకులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బైకు మీద నుంచి దూకి రైడర్ ఎలాగోలా ప్రణాలు కాపాడుకోగలిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని అగ్నిమాపక బృందాన్ని పిలిపించారు. వారు మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే బైకు పూర్తిగా కాలి బూడిదయ్యింది.