ETV Bharat / state

సంక్రాంతి నుంచి 'రైతు భరోసా' డబ్బులు - ఈ నెల 28న నిరుపేదలకు రూ.6 వేల సాయం - RYTHU BHAROSA FROM SANKRANTHI 2025

భూమి లేని నిరుపేదలకు నగదు బదిలీ, రైతు భరోసా పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు - నిధుల సమీకరణపై ఆర్థికశాఖ దృష్టి

CASH TRANSFER TO THE LANDLESS POOR
TG govt On Landless Poor Families (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 23, 2024, 7:26 AM IST

TG govt On Landless Poor Families : భూమి లేని నిరుపేదలకు ఆర్థిక సహాయం, అన్నదాతలకు రైతు భరోసా పథకాల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమి లేకుండా, కూలీ పనులు చేసుకొని జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నారు. తెలంగాణలో మొత్తం 1.16 కోట్ల కుటుంబాలు ఉన్నాయని ఇటీవలే నిర్వహించిన ఇంటింటి సర్వేలో తేలింది. దీంట్లో పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులు 70 లక్షలని రెవెన్యూ రికార్డులు ఉన్నాయి. మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేదు. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

భూమి లేని నిరుపేదలకు నగదు : తెలంగాణలో మొత్తం 53 లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులున్నా, వారిలో 32 లక్షల మంది మాత్రమే రోజూ కూలీ పనులకు పోతున్నట్లు కార్డులు చలామణిలో ఉన్నాయి. ఈ కార్డుదారుల్లో భూమి లేని వారు దాదాపు 15 లక్షల నుంచి 16 లక్షల వరకు ఉంచవచ్చని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. వీరికి రూ.6 వేల చొప్పున ఇవ్వడానికి దాదాపు రూ.1000 కోట్ల వరకూ అవసరం ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది.

అయితే ప్రభుత్వం ఏ ప్రాతిపదికన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేస్తుందన్నది కసరత్తు పూర్తయితే గానీ తెలీదు. ఈ పథకంతో ఒక్కో నిరుపేద కూలీ కుటుంబానికి సంవత్సరానికి రెండు విడతలుగా రూ.12 వేలు వస్తాయని, అందులో తొలి విడతగా రూ.6 వేలను ఈ నెల 28న విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు.

రైతు భరోసా పథకానికీ నిధుల సమీకరణ : దీంతో పాటు రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టనుంది. వచ్చే నెల 14న సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికే చాలాసార్లు తెలిపారు. దీనికి అర్హులైన రైతులను గుర్తించడానికి త్వరలోనే కొత్త మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు అనర్హులను తొలగించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలు వర్గాలతో చర్చలు జరిపింది. గత ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పంట సాగుచేయని భూముల యజమానులకు రూ.21 వేల కోట్లకు పైగా ఇచ్చారని, కానీ ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని వాస్తవంగా సాగుచేసే నిజమైన రైతులందరికీ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కొండలు, గుట్టలు, రహదారులకు కూడా పట్టాదారు పాసుపుస్తకాలు ఉండటంతో వాటిని గుర్తించేందుకు కసరత్తు చేస్తుంది.

నిధుల విడుదలకు సమస్యలు : ఇవన్నీ పూర్తి చేసి సంక్రాంతి నుంచి రైతుభరోసా ఇవ్వాలంటే కనీసం రూ.5-6 వేల కోట్లు కావాలని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో రైతు భరోసా పథకానికి రూ.15 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. వీటి విడుదలకు ఎలాంటి సమస్యలు లేవు. కానీ ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల్లో ఒకేసారి రూ.ఆరేడు వేల కోట్లను జమ చేయడమే అసలు సమస్య అని అంటున్నారు. సంక్రాంతి వరకు బాండ్ల విక్రయంతో మరో రూ.4 వేల కోట్ల వరకూ రుణాలను సేకరించనున్నారు.

బాండ్ల విక్రయం ద్వారా ఆదాయం : గత వారంలో రూ.1500 కోట్ల రుణాలను బాండ్ల విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. పన్నుల ద్వారా కూడా ఆదాయం పెంచాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో పన్నుల ద్వారా అధిక ఆదాయం చేకూరుతుంది. ఈ సంవత్సరం కూడా అదే తరహాలో జనవరి నుంచి పన్నుల ద్వారా ఆదాయం వస్తుందని, సంక్షేమ పథకాలకు నిధుల విడుదలకు ఇబ్బందులు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిధుల సమీకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, రైతు భరోసాకు ఇవ్వడానికి ఇబ్బందులేమీ ఉండవని ఆర్థిక శాఖ వర్గాలు ఇప్పటికే తెలిపాయి.

"తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి బొనాంజా​" - ఇటు వీరి ఖాతాల్లో డబ్బులు, అటు వారికి రేషన్​ కార్డులు

'రైతు భరోసా'పై క్లారిటీ వచ్చేసింది! - అన్నదాతల ఖాతాల్లో డబ్బులు పడేది ఎప్పుడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.