thumbnail

పులికి చెమటలు పట్టించిన అడవి కుక్కలు

By

Published : Jul 31, 2021, 5:04 PM IST

Updated : Jul 31, 2021, 6:21 PM IST

పులిని చూసిన మరు క్షణమే ఏ జంతువైనా ప్రాణభయంతో పరుగులు పెడుతుంది. కానీ కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో మాత్రం.. ఓ పులిని అడవి కుక్కలు ఆట పట్టించిన తీరు నవ్వులు పూయిస్తోంది. దారి వెంట వస్తున్న పులి చుట్టూ చేరిన 3 అడవి కుక్కలు.. దాన్ని ముప్పు తిప్పలు పెట్టాయి. మూడు దిక్కులో చేరి ఆటలాడుతూ పులికి విసుగు పుట్టించాయి. అలసిపోయిన పులి.. పొదల చాటున దాక్కుని కుక్కులపై దాడికి యత్నించింది. బెదిరిపోయిన అడవి కుక్కలు.. ప్రాణభయంతో అక్కడినుంచి తలో దిక్కుకు పరుగులెత్తాయి. ఆ సమయంలో సఫారీకి వచ్చిన ఓ టూరిస్ట్ ఈ దృశ్యాలను తన చరవాణిలో బంధించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
Last Updated : Jul 31, 2021, 6:21 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.