Building collapse: బిహార్లో భయానక దృశ్యాలు - కుప్పకూలిన భవనం
🎬 Watch Now: Feature Video

బిహార్‌లోని జెహనాబాద్ జిల్లాలో రెండస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది(building collapse). అయితే అప్పటికే భవనంలోని వారంతా బయటకు వచ్చేయటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ భవనం.. ముఖ్దంపూర్ మార్కెట్ రోడ్డుకు ఆనుకోని ఉండగా.. ప్రమాద సమయంలో రహదారిపై ఎవరు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అయినప్పటికీ కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ అమలు చేస్తుండటం వల్ల ప్రాణ నష్టం తప్పింది. భవనం పునాది బలహీనంగా ఉండటం వల్లే ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.