భీకర గాలులు.. నడిసంద్రంలో 'ధ్రువ్' రెస్క్యూ ఆపరేషన్ - తీరప్రాంతదళం సాహసం
🎬 Watch Now: Feature Video
సముద్రంలో చిక్కుకున్న ఓ నౌకలోని సిబ్బందిని రక్షించేందుకు తీర ప్రాంత రక్షణ దళం సాహసం చేసింది. దీవ్ తీరంలో భీకర గాలుల మధ్య రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోను తీర ప్రాంత రక్షణ దళం విడుదల చేసింది. సోమవారం రాత్రి వాతావరణం సవాల్ విసిరే కఠిన పరిస్థితుల మధ్య ధ్రువ్ హెలికాఫ్టర్ ద్వారా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి మునిగిపోతున్న పడవ నుంచి ఏడుగురు సిబ్బందిని కాపాడామని వెల్లడించింది. నౌకలోని సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది.