సైనికుడి భౌతిక కాయం వద్ద తండ్రి భావోద్వేగం- వీడియో వైరల్ - Rifleman Khatnei Konyak
🎬 Watch Now: Feature Video
మణిపుర్ ఆకస్మిక దాడిలో అమరుడైన రైఫిల్‌మెన్ ఖాట్నే కోన్యాక్ భౌతిక కాయం ముందు.. ఆయన తండ్రి భావోద్వేగంతో మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దేశం కోసం తన రక్తాన్ని అందించిన కుమారుడి పట్ల గర్వంగా ఉందన్నారు. తమ తెగ నుంచి మరికొంత మందిని సైన్యంలోకి పంపిస్తామని గద్గద స్వరంతో అన్నారు. అసోం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు శనివారం దాడి చేయగా.. కర్నల్ విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారుడితో పాటు మరో ఐదుగురు సిబ్బంది చనిపోయారు.