బాత్రూమ్లో కొండ చిలువ.. గుండెలు హడల్! - ఇంట్లోకి కొండ చిలువ వార్త
🎬 Watch Now: Feature Video
హిమాచల్‌ప్రదేశ్, హమీర్పుర్ జిల్లా భోరంజ్ పట్టణ పరిధిలోని ఓ ఇంట్లో కొండచిలువ కనిపించిన ఘటన కలకలం సృష్టించింది. చంభో గ్రామంలో ఇంటి బాత్ రూమ్‌లో అర్ధరాత్రి శబ్దాలు వినిపించగా.. కుటుంబసభ్యులు అప్రమత్తమయ్యారు. వెళ్లి చూడగా.. వాషింగ్ మెషిన్‌ను చుట్టుకుని ఉన్న ఓ భారీ కొండ చిలువ వారిని భయభ్రాంతులకు గురిచేసింది. అటవీ సిబ్బందికి సమాచారం అందించగా.. దానిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.