Viral video: వరద దాటేందుకు మంత్రి సాహసం - వరదలు
🎬 Watch Now: Feature Video
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి రామ్‌లాల్ మార్కాండ.. పెద్ద సాహసమే చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టించగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లాహోల్ స్పీతి ప్రాంతంలోనూ ఓ వంతెన కూలిపోయింది. ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన మంత్రి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదను దాటాల్సి వచ్చింది. సహాయక సిబ్బంది నీటిపై ఓ నిచ్చెన ఏర్పాటు చేయగా.. దాని సాయంతో మంత్రి ప్రవాహాన్ని దాటారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.