Viral Video: బాలుడ్ని చావబాదిన మాజీ పోలీస్ - గురుగ్రామ్
🎬 Watch Now: Feature Video
గురుగ్రామ్‌లో మాజీ పోలీస్.. ఓ పిల్లాడిని కరెంట్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉండగా వారి స్నేహితుల్లో ఒకరి కంటికి గాయమైంది. దీంతో గొడవ తలెత్తింది. తన కుమారుడ్ని గాయపరిచాడనే కోపంతో విశ్రాంత పోలీస్, అతడి కుటుంబ సభ్యులు బాలుడ్ని స్తంభానికి కట్టేసి నిర్దాక్షిణ్యంగా చావబాదారు. వదిలేయమని బాలుడి సోదరి ప్రాధేయపడినా పట్టించుకోలేదు. ఈ ఘటన సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 39లో జరిగింది.