లైవ్ వీడియో: రోడ్లపై సింహాల గుంపు హల్చల్! - గుజరాత్ వైరల్ న్యూస్
🎬 Watch Now: Feature Video
సింహాలను సాధారణంగా అభయారణ్యాల్లో చూస్తుంటాం. లేదా జంతుప్రదర్శనశాలలో చూస్తాం. కానీ గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో మాత్రం సింహాల మంద రహదారిపై దర్జాగా తిరుగుతూ కనిపించింది. సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో గుజరాత్‌లోని పిపావావ్ నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై.. ఐదు సింహాలు కనిపించాయి. వాటిలో మూడు పెద్దవి, రెండు పిల్ల సింహాలు. హైవేపై సింహాల మందను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.