హై స్పీడ్.. చేతిలో మొబైల్.. క్షణాల్లో యాక్సిడెంట్! - video of car bike accident in gujarat
🎬 Watch Now: Feature Video
గుజరాత్ రాజ్‌కోట్‌లో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఘోర ప్రమాదానికి దారితీసింది. వాహనం నడిపేటప్పుడు మొబైల్ వాడొద్దని ట్రాఫిక్ నియమాలు ఘోషిస్తున్నా.. కారు నడుపుతూ ఫోన్లో వీడియో చిత్రీకరించాడు ఓ వ్యక్తి. వాహనాన్ని, కెమెరాను ఒకేసారి అదుపుచేయలేక రోడ్డు దాటుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ఘటన మొత్తం అతడు తీస్తున్న వీడియోలో స్పష్టంగా రికార్డైంది. తీవ్రంగా గాయపడ్డ బైక్ చోదకుడు, వెనక కూర్చున్న మహిళ, కారు డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.