హోటల్ ప్రాంగణంలో సింహం షికారు! - జునాగఢ్ హోటల్లో సింహం దృశ్యాలు
🎬 Watch Now: Feature Video
గుజరాత్‌లోని ఓ రెస్టారెంట్లో సింహం సంచరిస్తూ పట్టుబడింది. జునాగఢ్‌లోని ఓ హోటల్ ప్రాంగణంలో అటూ ఇటూ తిరుగుతూ కనిపించిన సింహం దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నెల 8న(సోమవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింహం అటుగా రావడం చూసిన అక్కడి సెక్యూరిటీ గార్డ్.. అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.