వ్యాపారిపై తూటాల వర్షం.. త్రుటిలో తప్పిన ప్రమాదం! - నోయిడా
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్లో దుండగులు రెచ్చిపోయారు. గ్రేటర్ నోయిడాలోని గువార్ సిటీలో ఓ స్థిరాస్తి వ్యాపారిపై కాల్పులు జరిపారు. వ్యాపారి తన ఇంటి వద్ద కారు దిగి వెళ్తున్న సమయంలో... అక్కడే మాటువేసిన దుండగులు ఒక్కసారిగా అతనిపై కాల్పులు జరిపారు. ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న వ్యాపారి ప్రాణాలు దక్కించుకున్నాడు. అనంతరం దుండగులు ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.