లైవ్ వీడియో: సిలిండర్ పేలి అగ్నికి ఆహుతి - టీ తయారు చేసేందుకు పొయ్యి
🎬 Watch Now: Feature Video
తమిళనాడులోని ఓ టీ షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ షాపు యజమాని మృతిచెందాడు. అతడిని కేరళకు చెందిన మోహన్గా గుర్తించారు. చెన్నైలోని కిండి మసీదు కాలనీలో ఓ టీ షాపు నిర్వహిస్తూ జీవితం సాగిస్తున్న అతను.. రోజూలానే సోమవారం ఉదయం తన దుకాణాన్ని తెరిచి, టీ తయారు చేసేందుకు పొయ్యి వెలిగించాడు. అంతలోనే గ్యాస్ లీకై మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మోహన్.. మంటలు అంటుకున్న శరీరంతో దుకాణం నుంచి బయటకు పరుగులు తీశాడు. అది గమనించిన స్థానికులు మంటలు ఆర్పి, అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ అతను మంగళవారం మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.