ఆ బాధలో 17వ అంతస్తు నుంచి దూకాలనుకుంది.. కానీ! - bengaluru

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 26, 2020, 3:14 PM IST

తల్లి చనిపోయిందనే కుంగుబాటుతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేయగా.. అగ్నిమాపక సిబ్బంది కాపాడిన ఘటన బెంగళూరులో జరిగింది. శుభ అనే యువతి సంవత్సరం క్రితం తన తల్లిని కోల్పోయింది. తల్లి వర్ధంతి నిమిత్తం దిల్లీ నుంచి బెంగళూరు వచ్చింది. లాక్​డౌన్​ కారణంగా తిరిగి వెళ్లలేక.. స్థానిక ప్రెస్టైజ్​ సన్​రైస్​​ అపార్ట్​మెంట్స్​లో ఉండే బంధువుల ఇంటికి వెళ్లింది. అయితే.. తల్లి పోయిన బాధలోనే ఉన్న ఆమె ఆదే అపార్ట్​మెంట్​లో 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ.. భయ పడి కిటికీ బయటిభాగంలోనే ఉండిపోయింది. గమనించిన వాచ్​మెన్​.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా వారు చాకచక్యంతో ఆమెను కాపాడారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.