భాజపా ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు.. ఏమైందంటే? - భాజపా ఎమ్మల్యేకు చెంపదెబ్బ
🎬 Watch Now: Feature Video
Farmer Slaps BJP MLA In UP: ఉత్తర్‌ప్రదేశ్, ఉన్నావ్‌లో భాజపా ఎమ్మెల్యే పంకజ్ గుప్తాపై ఓ రైతు చేయిచేసుకున్నాడు. సభలో అందరు చూస్తుండగా స్టేజీపైకి వచ్చి గుప్తా చెంప చెళ్లుమనిపించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ రైతును పక్కకు తీసుకెళ్లారు. అయితే కొట్టిన వ్యక్తి వరుసకు తనకు మామ అవుతాడని, ప్రేమతో అలా కొడుతుంటాడని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే పంకజ్ గుప్తా. ఏదేమైనా ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అనంతరం.. ఎమ్మెల్యే పంకజ్ గుప్తా, చెంపదెబ్బకొట్టిన రైతుతో కలిసి మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వడం అసలు ట్విస్ట్. ఎమ్మెల్యే పంకజ్ గుప్తా మాట్లాడుతూ.. 'అతడు నా తండ్రి లాంటివాడు. మేం చాలాసార్లు కలిసి పనిచేశాం. అతను నన్ను ప్రేమతో మాత్రమే కొట్టాడు. చెంపదెబ్బ కొట్టలేదు. ప్రతిపక్షాలు కావాలనే ఎడిట్ చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచి చక్కర్లు కొట్టిస్తున్నాయి' అని వెల్లడించారు.
Last Updated : Jan 8, 2022, 8:39 PM IST