thumbnail

వృద్ధులే కదా అని దొంగతనానికొస్తే.. తరిమేస్తాం!

By

Published : Aug 12, 2019, 3:39 PM IST

Updated : Sep 26, 2019, 6:24 PM IST

తమిళనాడు తిరునల్వేలి జిల్లా కడయంలో కత్తులతో దండెత్తిన దొంగలను ఇద్దరు వృద్ధులు తరిమికొట్టారు. రాత్రి సమయంలో బయట కూర్చున్న వృద్ధుడిని వెనక నుంచి వచ్చి గొంతు నులిమే ప్రయత్నం చేశాడు ఓ దొంగ. శబ్దానికి.. బయటకు వచ్చిన వృద్ధుడి భార్యను మరో దొంగ బెదిరిద్దామనుకున్నాడు. కానీ చెప్పులతో దాడి చేసి బెదరకుండా ప్రతిఘటించిందా పెద్దావిడ. మొదటి దొంగ బెదిరిపోయి వృద్ధుడిని వదిలేశాడు. కుర్చీలతో తిరగబడేసరికి ఇద్దరు దొంగల కత్తులు బలాదూర్​ అయ్యాయి. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.
Last Updated : Sep 26, 2019, 6:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.