లైవ్ వీడియో: 9వ అంతస్తు నుంచి జారిపడిన మహిళ - తొమ్మిదో అంతస్తు మహిళ ఆత్మహత్య

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 14, 2021, 9:17 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ గాజియాబాద్‌కు చెందిన ఓ మహిళ తొమ్మిదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ప్రమాద సమయంలో బాల్కనీలో ఉన్న ఓ వ్యక్తి రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ ఆ మహిళ కిందపడిపోయింది. రెప్పపాటులో జరిగిన ఈ భయంకర ఘటనలో గాయాలపాలైన మహిళ నోయిడాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగానే ఆ మహిళ కిందికి దూకిందని అపార్ట్​మెంట్ వాసులు చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఆమె స్పృహలోకి వచ్చిన తరువాతే మరిన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.