గంటల తరబడి నేలపైనే కరోనా రోగి మృతదేహం - కర్ణాటక అత్తిబేలేలో కరోనా మృతదేహం
🎬 Watch Now: Feature Video
కొవిడ్‌తో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని పట్టించుకోకుండా వదిలేశారు ఓ ఆస్పత్రి సిబ్బంది. కర్ణాటక అత్తిబేలేలోని ఆక్స్ఫర్డ్ ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. కరోనాతో చికిత్స పొందుతున్న ఓ రోగి.. పడక మీద నుంచి శనివారం ఉదయం కింద పడిపోయాడు. ఆ సమయంలో అతడికి సాయం చేసేందుకు ఎవరూ రాలేదు. అనంతరం అతడు మృతి చెందాడు. దాంతో నాలుగైదు గంటలపాటు ఆ మృతదేహాం.. నేల మీదే ఉండిపోయింది. ఆ తర్వాత.. ఆస్పత్రి సిబ్బంది వచ్చి మృతదేహాన్ని తరలించారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో కొవిడ్ రోగి ఈ దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించగా వైరల్‌గా మారింది.