తవ్వకాల్లో బయటపడ్డ 1689 పురాతన నాణేలు.. ఎక్కడంటే? - తవ్వకాల్లో బ్రిటిష్ కాలంనాటి నాణేలు లభ్యం న్యూస్
🎬 Watch Now: Feature Video
Coins Excavations In Aurangabad: మహారాష్ట్ర, ఔరంగాబాద్‌లోని ప్రియదర్శిని గార్డెన్లో జరిపిన తవ్వకాల్లో బ్రిటిష్ కాలంనాటి నాణేలు బయపడ్డాయి. దివంగత బాల్ ఠాక్రే మెమోరియల్ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా.. 1689 నాణేలు బయటపడ్డాయి. వీటిని 1854- 1861 సంవత్సరాలకు చెందినవిగా గుర్తించారు. నాణేలపై రాణి విక్టోరియా చిత్రాలు ఉన్నాయి. ఈ నాణేల బరువు రెండు కిలోలు ఉన్నట్లు తెలిపారు అధికారులు. ఈ నాణేలను పురావస్తుశాఖకు అందించారు.