ఆకాశంలో అద్భుతం- జాబిల్లి అపురూప దృశ్యం
🎬 Watch Now: Feature Video
ఆకాశంలో జాబిల్లి అపురూప రూపం ఆవిష్కృతమైంది. సంపూర్ణ చంద్ర గ్రహణం, సూపర్ మూన్ రెండూ ఒకేసారి కనువిందు చేశాయి. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి రావడంతో సాధారణ రోజుల కంటే చంద్రుడు పెద్దగా నారింజ, ఎరుపు రంగులో దర్శనమిచ్చాడు. భారత్‌లోని తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో సూపర్ మూన్ పాక్షికంగా దర్శనమివ్వగా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పసిఫిక్, తూర్పు ఆసియా దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించింది.