సింహం మాస్క్‌తో ఎంట్రీ.. సీసీటీవీలపై స్ప్రే.. నిమిషాల్లో కోట్లు దోపిడీ! - వేలూర్ న్యూస్
🎬 Watch Now: Feature Video

తమిళనాడు వేలూర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. వెనుకవైపు గోడకు పెద్ద రంధ్రం చేసి జోస్ అలుకాస్ జువెలరీ షాప్‌లోకి ప్రవేశించారు. 15 కేజీల బంగారం, రూ. 8 కోట్ల విలువైన డైమండ్ దోచుకెళ్లారు. చోరీ బుధవారం జరగగా.. గురువారం సీసీటీవీ దృశ్యాలను విడుదల చేశారు పోలీసులు. సింహం ఆకారం మాస్క్ ధరించిన ఓ దుండగుడు.. సీసీటీవీలపై స్ప్రే చేయడం గమనార్హం. డీఎస్పీ నేతృత్వంలోని 8 పోలీసు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి.