దిల్లీలో జనసమూహంపైకి దూసుకెళ్లిన కారు - DELHI
🎬 Watch Now: Feature Video
దేశ రాజధాని దిల్లీలో ఓ కారు విధ్వంసం సృష్టించింది. జనసమూహంపైకి దూసుకెళ్లి అక్కడున్న వారిని తీవ్ర భయాందోళనకు గురి చేసింది. డ్రైవర్ చర్యతో ఆగ్రహించిన స్థానికులు కారుపై దాడి చేశారు. ఓ వ్యక్తి కారుపైకి ఎక్కి కారును ద్వసం చేస్తుండగా.. అతివేగంతో కారు ముందుకు సాగింది. ఆ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. దిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతం గుప్తా కాలనీలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
Last Updated : Sep 29, 2019, 5:00 AM IST