Live Video: పోలీసులకు చిక్కకూడదని దుస్సాహసం- ఆస్పత్రిలో మృత్యువుతో పోరాటం! - ట్రాఫిక్ న్యూస్ టుడే
🎬 Watch Now: Feature Video
ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. బెంగళూరులో డిసెంబర్ 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కత్రిగుప్పెకు చెందిన కౌశిక్, చేతన్ అనే స్నేహితులు హెల్మెట్ ధరించకుండా బైక్‌పై వెళ్తున్నారు. మార్గంమధ్యలో ట్రాఫిక్ పోలీసులు కనిపించారు. వారి నుంచి తప్పించుకునేందుకు వేగం పెంచారు. ఈ క్రమంలో డివైడర్‌ను బలంగా ఢీకొట్టారు. దీనితో బైక్‌పై నుంచి కింద పడిన కౌశిక్ తలకు తీవ్ర గాయమైంది. ఈ దృశ్యాలు సమీప సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చేతన్ అనే వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు.