లైవ్ వీడియో: ఒకేసారి నాలుగు బైక్లు ఢీ - బైకులు ఢీ కొన్న వీడియో
🎬 Watch Now: Feature Video
నాలుగు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటన కర్ణాటక కొప్పల్ ప్రాంతంలో జరిగింది. ముందు బైక్ మీద వెళ్తున్న వ్యక్తి తన బండిని ఎడమ వైపునకు తిప్పాడు. వెనుక మరో ద్విచక్రవాహనంపై వచ్చిన వ్యక్తి.. వాళ్లకు తగలకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. కానీ.. ప్రమాదవశాత్తు రెండు బైక్లు అదుపుతప్పి కిందపడ్డాయి. వారి వెనుకే వచ్చిన మరో రెండు ద్విచక్ర వాహనాలూ స్కిడ్ అయ్యాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ కాలేదు. ఈ దృశ్యాలు పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి.