విపత్తు వేళ గర్భిణీకి ఎన్డీఆర్ఎఫ్ చేయూత - బంగాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
🎬 Watch Now: Feature Video
బంగాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. అక్కడి ప్రజలకు జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) అండగా నిలుస్తోంది. ఘాటాల్ ప్రాంతంలో ఓ గర్భిణీకి.. అత్యవసరంగా వైద్య సేవలు అవసరం కాగా... ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆదుకున్నారు. ఆమెను వరదల మధ్యే.. శుక్రవారం ఓ ఆస్పత్రికి తరలించి, వైద్య సేవలందించారు. బంగాల్లో కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కరుస్తున్నాయి. వరదల కారణంగా పలు గ్రామాల్లో రాకపోకలు స్తంభించాయి.