తుపాకీతో బెదిరించి 8 లక్షలు కొల్లగొట్టారు..! - looty
🎬 Watch Now: Feature Video
ఐసీఐసీఐ బ్యాంక్‌లోకి చొరబడిన కొందరు దుండగులు తుపాకీతో బెదిరించి రూ. 8 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు. బిహార్ ముజఫర్పుర్జిల్లాలో జరిగిందీ ఘటన. మొత్తం ఆరుగురు దొంగలు తుపాకులతో బ్యాంకులోకి ప్రవేశించినట్లు చెప్పారు ప్రత్యక్ష సాక్షులు. సెక్యూరిటీ గార్డు దగ్గర ఉన్న డబుల్ బ్యారెల్ తుపాకీని తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. జరిగిందంతా అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యింది.