గడ్డి తింటున్న సింహాన్ని ఎప్పుడైనా చూశారా? - vegitarian lion
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4276714-802-4276714-1567063521042.jpg)
అడవిలో ఏ జంతువునైనా తన ఆహారంగా మార్చుకోగల సత్తా సింహం సొంతం. ఇన్నాళ్లు సింహరాజును మాంసాహార ప్రియుడిగానే గుర్తించాం. కానీ, గుజరాత్లోని ఓ సింహం పక్కా శాకాహారిగా మారి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అడవిలో పచ్చి గడ్డి తినేస్తోంది. మాంసం తిని బోర్ కొట్టిందో లేక అస్వస్థతకు గురైందో తెలియదుగానీ... ఇలా గడ్డి తింటూ కెమెరాకు చిక్కింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Last Updated : Sep 28, 2019, 5:30 PM IST