ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. అంతలోనే! - పూరీ వార్తలు
🎬 Watch Now: Feature Video
ఒడిశాలోని పూరీ జిల్లా ఫతేపుర్ గ్రామంలో ఓ 40 అడుగుల భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. తీవ్ర గాయాలతో కొనఊపిరితో ఉన్న వేల్ను స్థానిక జాలర్లు గుర్తించారు. అటవీశాఖ అధికారులు వెళ్లే సమయానికే.. తిమింగలం మరణించింది. వలలున్న ఓ పడవను ఢీకొట్టడం వల్లే అది గాయపడినట్టు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు.